![]() |
![]() |
.webp)
"సిలకేమో సీకాకుళం" అంటూ వెంకీ మూవీలో ఐటెం సాంగ్ చేసిన రాశి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆమె ఒకప్పుడు చాలా ఫామిలీ టైపు మూవీస్ చేశారు. శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి వాళ్లందరితో ఆమె నటించింది. అలాంటి రాశి కెరీర్ నిజం అనే మూవీతో ఆగిపోయింది. అలాగే డైరెక్టర్ తేజ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా కామెంట్స్ చేశారు. "చెప్పిన క్యారెక్టర్ ఒకటి చేయించింది ఇంకో క్యారెక్టర్ అని ఆ మూవీ వదిలేసి వెళ్లిపోయారు" అంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు రాశి జవాబిచ్చారు. "నాకు ఇలా చెప్పలేదు. తేజ గారు నన్ను ఆఫీస్ కి పిలిచారు. స్టోరీ చెప్పుకొచ్చారు. ఎలా అంటే గోపీచంద్ - మీకు మధ్య లవ్ ఉంటుంది ఇందులోకి మహేష్ బాబు గారు ఎంటరవుతారన్నారు. అప్పుడు మనం పాజిటివ్ గా ఫీలవుతామా, నెగటివ్ గానా...పాజిటివ్ గానే ఫీలవుతాం కదా.
అంటే మహేష్ బాబును పొడవటం, మగరాయుడిలా ఉండటం, లెన్స్ పెట్టాలి, లుక్ మారాలి అని చెప్పి ట్రైనర్ ని పెట్టి వెయిట్ లాస్ చేయించారు. ఆ మూవీకి అసలు మేకప్ లేదు. లెన్స్, లిప్ స్టిక్, కాజల్ అంతే. ఫస్ట్ డే షూట్ కి వెళ్లాను చేయకూడని సీన్ ని ఫస్ట్ డేనే పెట్టేసారు. తర్వాత చేసి ఉన్నా వేరేగా ఉండేది. కానీ ఫస్ట్ సీనే అది. తర్వాత పక్కకొచ్చి మా అన్నయ్యతో, పిఆర్ఓతో చెప్పా నేను ఈ సినిమా చేయను అని..ఈ సీన్స్ గురించి ముందే చెప్పలేదు నాకు చెప్పకుండా చేయడం తప్పు నేను చేయను నాకు ఉండే ఇమేజ్ కి ఈ సినిమా చేస్తే నా కెరీర్ కి ఫుల్ స్టాప్ ఐపోతుంది అని చెప్పా. ఇక పిఆర్ఓ బాబురావు గారు వచ్చి సెట్ లో షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళిపోవడం అనేది చరిత్రలో లేదు అన్నారు. ఇంత ఓపెన్ గా మీడియా ముందు నేను ఇలా చెప్తున్నాను అంటే అది నిజం కాబట్టే కదా. అబద్దం ఐతే చెప్పలేను కదా నేను కూడా. నేను కూడా అయిష్టంగానే చేసాను. అలా సినిమా ఐపోయాక తేజ గారు కాల్ చేసి సారీ అన్నారు . నా రోల్ కి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. సారీని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసాను. ఈ మూవీ వరకు ఆయన అంటే కోపం. లేకుంటే తేజ గారితో నేను చాలా ట్రావెల్ చేశా. కేక మూవీకి, లక్ష్మి కళ్యాణం మూవీలో కాజల్ అగర్వాల్ కి నేనే డబ్బింగ్ చెప్పాను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ని మర్చిపోతారు అని ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగితె తేజ పేరే చెప్పాను. నన్ను డిజప్పోయింట్ చేస్తే పర్లేదు. ఆడియన్స్ ని డిజప్పోయింట్ చేయకూడదు కదా. నిజంగానే ఆ సినిమా నా కెరీర్ కి ఫుల్ స్టాప్ ఐపోయింది." అని చెప్పింది.
![]() |
![]() |